మాధురిని బాలీవుడ్ ఇండస్ట్రీ తొక్కేసింది.. కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-07-06 16:08:36.0  )
మాధురిని బాలీవుడ్ ఇండస్ట్రీ తొక్కేసింది.. కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మాధురీ దీక్షిత్‌కు బాలీవుడ్ ఇండస్ట్రీలో అన్యాయం జరిగిందంటోంది కాజోల్. ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కాజోల్‌కు తాజా సమావేశంలో ఓ భిన్నమైన ప్రశ్న ఎదురైంది. ‘చిత్ర పరిశ్రమలోకి మీ జనరేషన్‌లో వచ్చిన నటీమణుల్లో అందరికంటే వెనకపడిపోయిన వారెవరూ?' అని అడగగా.. ‘మాధురికి తగినన్ని అవకాశాలు రాలేదు. ఆమెకు అనుకున్నంత విలువ దక్కలేదు. తనను సాధారణ నటిగా అంచనా వేసి అవకాశాలు రాకుండా చేశారు. అయినప్పటికీ తన టాలెంట్ నిరూపించుకుంటూ ప్రజాధారణ పొందింది. నిజంగా ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండానే ఆమె ఎదిగిన తీరుకు నేను గర్వంగా ఫీల్ అవుతా’ అంటూ సహనటిపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది కాజోల్.

Read More: Salaar : ఆ స్టార్ హీరో‌ వదులుకున్నాకే.. ప్రభాస్ వద్దకు ‘సలార్’ స్టోరీ!

Advertisement

Next Story