ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ సత్యభామ మూవీ

by Prasanna |
ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ సత్యభామ మూవీ
X

దిశ, సినిమా: కాజల్ అగర్వాల్ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది.చందమామ సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచిన ఈ బ్యూటీ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వివాహం చేసుకుని కొంత కాలం విరామం తీసుకుంది.

పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామతో మన ముందుకొచ్చింది. క్రైమ్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందినప్పటికీ, జనాలకు ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు. మిక్స్డ్ టాక్ తో అంతంత మాత్రాన థియేటర్లలో ఆడింది.

ఇక థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన సత్యభామ కలెక్షన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. తాజాగా, ఈ మూవీ ఓటీటీలో మెరిసింది. ఎలాంటి అనౌన్స్ లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సత్యభామ ప్రస్తుతం ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు మీ ఇంట్లోనే చూడవచ్చు.

Next Story

Most Viewed