‘భగవంత్ కేసరి’ నుంచి కాజల్ లుక్ రిలీజ్

by Prasanna |   ( Updated:2023-10-10 13:15:27.0  )
‘భగవంత్ కేసరి’ నుంచి కాజల్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల బాలకృష్ణ కూతురు పాత్రలో నటిస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ వాళ్లు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న విడుదలకానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్‌లో భాగంగా మూవీ నుంచి ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలు, పాటలను విడుదల చేశారు. అలాగే అక్టోబర్ 8న ట్రైలర్‌‌ రిలీజ్ చేయనుండగా దానికి ఒకరోజు ముందే కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో కాత్యాయని పాత్రలో కాజల్ కనిపించబోతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది మూవీ యూనిట్.

Advertisement

Next Story