కాజల్ పుట్టిన రోజు సందర్భంగా తన 60వ సినిమా అనౌన్స్

by Anjali |   ( Updated:2023-06-19 03:45:59.0  )
కాజల్ పుట్టిన రోజు సందర్భంగా తన 60వ సినిమా అనౌన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన ‘‘లక్ష్మీ కల్యాణం’’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం స్టార్ హీయియిన్‌గా పేరు సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. ‘‘మగధీర, గణేష్, ఆర్య-2, డార్లింగ్, బ‌ృందావనం, నా పేరు శివ, ఖైదీ నెంబర్ 150, గోవిందుడు అందరివాడేలే’’ లాంటి సినిమాల్లో అగ్రహీరోల సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే నేడు(జూన్ 19) కాజల్ పుట్టిన రోజు సందర్భంగా తన 60వ మూవీని అనౌన్స్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ ఒక పవర్‌పుల్ పోలీసు ఏసీపీ ఆఫీసర్‌‌గా కనిపించనుంది. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. కాజల్ ఇప్పటికీ ‘మగధీర’లో మిత్రవిందాలానే ఉంది. ఫస్ట్ గ్లింప్స్ చాలా బాగుంది. కాజల్ చెప్పిన డైలాగ్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. యంగ్ టీమ్‌ అంతా కలిసి చేసిన ఈ చిత్రం సక్సెస్ సాధించాలని విష్ చేస్తున్నానని’’ చెప్పుకొచ్చారు. ‘ఈ బర్త్‌డే నాకు చాలా ప్రత్యేకమైనది ‘సత్యభామ’ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు.’ అని కాజల్ మాట్లాడారు. కాగా నేడు ఆమె 38వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటుంది.

Also Read: సమంతతో రిలేషిప్‌పై ప్రీతమ్ కామెంట్స్.. మరీ అంత నీచంగా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అవుతున్న చైతు ఫ్యాన్స్..

Advertisement

Next Story