ఆ నొప్పిని.. ప్రేమగా భరించానంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ Kajal Aggarwal

by samatah |
ఆ నొప్పిని.. ప్రేమగా భరించానంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ Kajal Aggarwal
X

దిశ, వెబ్‌డెస్క్ : చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అంద చందాలతోనే కాకుండా, నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక కాజల్ అగర్వాల్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాజల్ చాలా మారిపోయిందని చెప్పవచ్చు. తాజాగా ఫ్రీడం టు ఫీడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మాతృత్వపు ప్రేమ గురించి చెబుతూ చాల ఏమోషనల్ అయ్యింది.




నాచిన్నారి నీల్ పుట్టిన తర్వాత వాడే నాప్రాణం అయిపోయాడని తెలిపింది. తనను విడిచి పెట్టి షూటింగ్‌లకు వెళ్లడం చాలా కష్టతరంగా అనిపించేది అంటూ తన మాతృత్వపు ప్రేమను చాటింది. అలాగే నీల్ పుట్టిన తర్వాత నా పర్సనల్ లైఫ్, నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోయాను. నీల్‌నే నా ప్రపంచం అయ్యాడు అని పేర్కొంది. ఏ తల్లి అయినా సరే తన బిడ్డకు తానే పాలివ్వాలనుకుంటుంది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కానీ ఆ సమయంలో చాలా నొప్పి వస్తుంటుంది. నా నీల్ కూడా పాలు తాగే సమయంలో చాలా నొప్పి వచ్చేది కానీ వాడిని చూస్తే ఆ నొప్పిని ఏం తెలియకపోయేది. ఆ పేయిన్‌ని ప్రేమగా భరించానంటూ తన అమ్మతనాన్ని కాజల్ అగర్వాల్ గొప్పగా చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

Also Read: కాబోయే భర్తతో పూర్ణ.. వైరల్ పిక్స్

Advertisement

Next Story

Most Viewed