- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో నైతిక విలువలు లేవు.. కాజల్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా : బాలీవుడ్ ఇండస్ట్రీ కల్చర్‌పై స్టార్ నటి కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ‘సౌత్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్’ అనే ఇష్యూపై తాజా సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించిన నటి.. దక్షిణాదిలో ఉన్న విలువలు బాలీవుడ్‌లో లేవని చెప్పింది. అంతేకాదు తాను ముంబైకి చెందిన అమ్మాయే అయినప్పటికీ కెరీర్ మాత్రం హైదరాబాద్‌లో మొదలైనట్లు తెలిపింది. ‘నేను బాలీవుడ్ కంటే తమిళ, తెలుగు చిత్రాల్లోనే ఎక్కువగా నటించాను. చెన్నై, హైదరాబాద్‌లే నా సొంత ఇళ్లుగా భావిస్తా. ఎందుకంటే ఇక్కడే స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. టాలెంట్ ఉన్నవాళ్లను ప్రేక్షకులు ఆదరిస్తారు. కంటెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ, బాలీవుడ్‌లో లోపించాయని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
ఇవి కూడా చదవండి: Sai Pallavi: నా మొటిమలు, వాయిస్.. అభద్రతా భావానికి గురిచేశాయి