K. Viswanath :కళాతపస్వీ కె. విశ్వనాథ్ సినీ ప్రయాణం మొదలైంది ఇలానే?

by Javid Pasha |   ( Updated:2023-02-03 07:30:33.0  )
K. Viswanath :కళాతపస్వీ కె. విశ్వనాథ్ సినీ ప్రయాణం మొదలైంది ఇలానే?
X

దిశ, వెబ్‌డెస్క్ : దిగ్గజ దర్శకులు కళాతపస్వీ కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరీ 19న, సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె మండలం పులివర్రు గ్రామం. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. ఇక గుంటూరులోని హిందీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విశ్వనాథ్ ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ కంప్లీట్ చేశారు.

ఇక చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో సౌండ్ రికార్డు ఆర్టిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించి ఆయన సినీ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం.

విశ్వనాథ్ బీఎస్సీ పూర్తైన వెంటనే వారాహి స్టూడియోలో 1957లో తోడికోడళ్లు సినిమాకు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అలాగే, ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన పాతాళ బైరవి, పెళ్లి చేసి చూడు, మాయాబజార్ వంటి చాలా సినిమాలకు సౌండ్ విభాగంలో పనిచేశారు. ఇక ఎంతో ఓపికగా పనిచేసేవారు విశ్వనాథ్. దీంతో ఆయన పనితనం మెచ్చి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు విశ్వనాథుకు సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. విశ్వనాథ్‌కు మూగమనులు, డా, చక్రవర్తి సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.

ఆ తర్వాత విశ్వనాథ్‌ను అదృష్టం వరించింది. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారారు. అక్కినేని నాగేశ్వర్ రావు హీరోగా ఆత్మగౌరవం సినిమా ద్వారా విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. ఆ తర్వాత చిన్న చిన్న సీనిమాలు తీసుకుంటూ వస్తున్న సమయంలో సిరిమమువ్వలు ఆయన జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి.

సిరిమువ్వలు సినిమా ద్వారా దర్శకుడిగా ఆయన ప్రతిభను అందరూ గుర్తించారు. తర్వాత నిండు హృదయాలు, స్వాతి ముత్యం, శృతిలయలు, శంకరాభరణం, సాగరసంగమం, స్వరాభిషేకం లాంటి ఎన్నోగొప్పసినిమాలకు పురుడు పోసి దిగ్గజ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. 50 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా విశ్వనాథ్ తన నటనతోను తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సంతోషం, నీస్నేహం, అతడు, ఆంధ్రుడు, స్వరాభిషేకం లాంటి సినిమాలలో నటించారు. ఇక సినీరంగంలో ఈయన చేసిన కృషికి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడమే కాకుండా పద్మశ్రీ కూడా ఆయనను వరించింది.

ఇవి కూడా చదవండి : K Viswanath :అవార్డులు అందుకోవడంపై విశ్వనాథ్ కామెంట్స్ ఇవే!

Advertisement

Next Story