అమీర్ ఖాన్ కొడుకుతో శ్రీదేవి కూతురు రొమాన్స్.. ఇండస్ట్రీలో జోరుగా చర్చ

by Prasanna |   ( Updated:2023-05-26 10:24:13.0  )
అమీర్ ఖాన్ కొడుకుతో శ్రీదేవి కూతురు రొమాన్స్.. ఇండస్ట్రీలో జోరుగా చర్చ
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో బిగ్ అప్‌డేట్ వెలువడింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ ఇప్పటికే హీరోయిన్‌గా రాణిస్తుండగా.. ఇపుడు చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా వరుస సినిమాలతో బిజీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ది ఆర్చీస్’లో నటిస్తున్న ఆమె మరో ప్రాజెక్ట్‌కు సెలెక్ట్ అయిందట. అంతేకాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జువైద్ ఖాన్ కూడా తెరంగేట్రం చేయబోతున్నట్లు సమాచారం. కాగా స్టార్ డైరెక్టర్ అద్వైత్ చందన్ హిందీలో రీమేక్ చేస్తున్న సూపర్ హిట్ సౌత్ మూవీ ‘లవ్ టుడే’లో వీరిద్దరూ నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై ఓ సమావేశంలో మాట్లాడిన బోనీ కపూర్.. ‘ఖుషీ సినిమాల్లోకి వస్తుందని మేము ఊహించలేదు. శ్రీదేవి చనిపోయే నాటికి ఆమెకు 16ఏళ్లు. అలాంటి అమ్మాయి ఇప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన గోల్ అని చెబుతోంది. మాకు ఆనందంగా ఉంది’ అని చెప్పాడట.

Also Read: ఆ దాడి తట్టుకోలేక గుండెలవిసేలా ఏడ్చాను.. దాన్నే టార్గెట్ చేశారు..

Advertisement

Next Story