చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీర్.. ఏంటీ ఈ సస్పెన్స్!

by Jakkula Samataha |
చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో హాట్ టాపిక్‌గా జూనియర్ ఎన్టీర్.. ఏంటీ ఈ సస్పెన్స్!
X

దిశ, సినిమా : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధిక మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేయనుంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి మొదటి సారిగా అత్యంత మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఆయన తన పార్టీ నుంచి ఎన్ని చోట్లో పోటీ చేశారో, అన్నింటిలోను విజయం సాధించారు. దీంతో వారికి ఎవరెవరికి ఏ శాఖాలు కేటాయిస్తారు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇలా పలవులురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురికి ఆహ్వానాలు అందాయి. అయితే ఈ ప్రమాణస్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందిందా ? లేదా అని అభిమానులు అయోమయంలో ఉన్నారు. కొందరేమో జూనియర్ ఎన్టీఆర్‌కు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది అంటే మరికొందరమో ఆయనకు ఎలాంటి ఇన్విటేషన్ అందలేదు అని చెప్పుకొస్తున్నారు. కాగా, ఇందులో ఎంత నిజం ఉందో మాత్రం తెలియదు.

సోషల్ మీడియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి ఆహ్వానం అందలేదు అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన దేవర షూటింగ్ బిజీలో గోవాలో ఉన్నారు. ప్రమాణస్వీకారానికి తారక్‌కు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు అని చెప్పుకొస్తున్నారు తమ అభిమానులు. కానీ నేషనల్ మీడియాస్ మాత్రం, తారక్‌కు ఆహ్వానం అందిందని, రాసుకొస్తున్నారు. దీంతో నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్ వస్తారా లేదా అని సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. కాగా, చివరకు ఏం జరుగుతుందో చూడాలి అంటున్నారు కొందరు.

Advertisement

Next Story

Most Viewed