రావణాసురుడిపై Jr. NTR షాకింగ్ కామెంట్స్.. చూసి బుద్ధి తెచ్చుకో అంటూ ఆదిపురుష్ డైరెక్టర్‌పై ఫైర్

by sudharani |   ( Updated:2023-06-26 12:12:10.0  )
రావణాసురుడిపై Jr. NTR షాకింగ్ కామెంట్స్.. చూసి బుద్ధి తెచ్చుకో అంటూ ఆదిపురుష్ డైరెక్టర్‌పై ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై లవకుశ’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ మొత్తం మూడు పాత్రల్లో నటించగా లవ, కుశ పాత్రలతో పోల్చి చూస్తే జై పాత్ర అభిమానులకు ఇంకా ఎక్కువ కిక్ ఇచ్చింది. జై అంటే సినిమాలో రావణుడి పాత్రగా చూపించారు. ఈ మూవీ రిలీజై ఐదేళ్ళు గడిచినప్పటికీ తాజాగా ఇందుకు సంబంధించిన ఎన్టీఆర్ ప్రమోషన్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా వచ్చిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ డిజాస్టర్‌గా నిలవడమే ఇందుకు కారణం. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆ మహాకావ్యాన్ని అవమానించేలా ఉందంటూ చాలా వివాదాలు జరిగాయి.

ముఖ్యంగా సినిమాలో కనిపిస్తున్న రావణాసురుడి పాత్ర ఆర్టిఫిషియల్‌గా ఉందని.. తలపై నిక్కబొడుచుకున్న జుట్టు, పొడవైన గడ్డం, కాటుక కళ్ళతో సైఫ్ రావణుడిలా కాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీలా కనిపించాడని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ‘ఆదిపురుష్’‌ను ట్రోల్ చేస్తూ.. ఎన్టీఆర్ ‘జై లవకుశ’ మూవీ టైంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో రావణుడి పాత్ర గురించి తారక్ వివరణ అద్భుతంగా ఉండగా.. రావణుడిని బ్రాహ్మణుడిగా, సకల శాస్త్రాలు, వేదాలు వల్లె వేసిన పండితుడిగా, అన్ని విద్యల్లోనూ ఆరితేరిన మహావీరుడిగా అభివర్ణించాడు. యుద్ధ సమయంలో రావణుడి రూపం చూసిన రాముడు ఆశ్చర్యచకితుడై కొనియాడినట్లు చెప్పుకొచ్చాడు. అంతగొప్ప వ్యక్తి పాత్రను తీర్చిదిద్దాలంటే ఆ లెవల్‌లో ఆలోచించాలి కానీ ఓం రౌత్ మాత్రం లంకేశ్వరుడిని పూర్తిగా దిగజార్చేశాడని తట్టిపోస్తున్న జనం.. కనీసం ఈ వీడియో చూసైనా బుద్ధి తెచ్చుకో అని వార్నింగ్ ఇస్తున్నారు.

Also Read

‘హనుమాన్’కు బ్రేక్.. ఇంతకూ రిలీజ్ డేట్ ఎప్పుడు..?

Advertisement

Next Story