Jr. NTR: మీరు అలా చేస్తే నెక్స్ట్ సినిమా ఆపేస్తాను కూడా.. : జూ.ఎన్టీఆర్

by Prasanna |   ( Updated:2023-03-18 06:05:19.0  )
Jr. NTR: మీరు అలా  చేస్తే నెక్స్ట్ సినిమా ఆపేస్తాను కూడా.. : జూ.ఎన్టీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ :విశ్వక్ సేన్ డైరెక్టర్ కమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ధమ్కీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు ముఖ్య అతిధిగా జూ.ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ ఈవెంటులో నందమూరి అభిమాని అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ ఈ విధంగా " ఏంటబ్బాయ్.. నెక్స్ట్ సినిమా చేయడం లేదు నేను ఎన్ని సార్లు చెప్పా.. మొన్నే చెప్పా కదా. సో త్వరలోనే మొదలవుతుంది.. కొంచం ఆగండి.. మీరు అలా చేస్తే నెక్స్ట్ సినిమా చేయట్లేదని ఆపేస్తాను కూడా.. అని నవ్వుకుంటూ.. మీరు ఆపమన్న నేను ఆపలేను నేను ఆపిన మీరు ఊరుకోరు కదా.. నా సినిమా అప్డేట్ త్వరలోనే రాబోతుంది. అది ఇంకో రోజు ఇంకో వేదిక మీద మాట్లాడుకుందాం.. ఇది దాస్ కా ధమ్కీ విశ్వక్ సేన్ సినిమా. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్ల వేదిక ఇది.. వాళ్లందరికీ ఆశీర్వాదాలు తెలియజేద్దాం. వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న విన్నపం దయచేసి జాగ్రత్తగా అందరూ ఇంటికి వెళ్ళండని " తన మాటల్లో తెలిపాడు.

Read more:

Dhamki Pre Release Event: విశ్వక్ సేన్ ఒక మాట అన్నాడు.. నాకు నిజంగా చాలా బాదేసింది: జూ.ఎన్టీఆర్

Advertisement

Next Story