- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని నాగార్జునతో గొడవపై స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేసిన జేడీ చక్రవర్తి !
దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివతో ఇండస్ట్రీకి నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా, నటుడిగా తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో నటించి స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. విభిన్న క్యారెక్టర్స్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ తనలోని నటనను చూపించి అందరి మెప్పు పొందుతున్నాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల జేడీ దయా అనే వెబ్‌సిరీస్ చేశాడు. ఆ తర్వాత ఏ కొత్త సినిమా ప్రకటించలేదు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీ చక్రవర్తి నాగార్జునతో జరిగిన గొడవపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ నేను ఓ హోటల్ లోపలికి వెళ్తున్నాను. అదే సమయంలో నాగార్జున బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో నా భుజం తాకింది. కానీ నేను క్షమాపణలు చెప్పలేదు దీంతో ఆయన కొంచెం కోపంగా చూసి వార్నింగ్ ఇచ్చారు. నా తప్పు లేకున్నా కానీ తిట్టారు. ఎందుకో నాకు చెప్పాలని అనిపించలేదు కానీ సారీ చెబితే అక్కడితో గొడవ అయిపోయేది. అలా చేయకపోవడం వల్ల నేను ఆయన కోపానికి గురి కావాల్సి వచ్చింది. నన్ను అసలు సినిమాలో తీసుకోవడమే ఎక్కువ కానీ నా భుజం తగిలినా నేను సారీ చెప్పలేదు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఓ చోట కలవడంతో అవన్నీ మర్చిపోయి ఆయన నాతో మాట్లాడారు. నాగార్జున లాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకుని ఫ్యాన్ అయిపోయాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.