- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘రుద్రమాంబపురం’నుంచి ‘జాతర’ సాంగ్ రిలీజ్ చేసిన శ్రీకాంత్

X
దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్ స్టార్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీస్‌లో ‘రుద్రమాంబపురం’ ఒకటి. అజయ్ ఘోష్, శుభోదయం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వహిస్తున్నాడు. మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభించగా తాజాగా ‘జాతర సాంగ్’ను సీనియర్ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ పాటను ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా.. భాష్య శ్రీ సాహిత్యం అందించారు. వెంగి సంగీతం అందించిన సినిమా జూలై 6 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Next Story