జాన్వీ కపూర్‌కు తోడి కోడలుగా స్టార్ హీరోయిన్.. ఎంగేజ్ మెంట్ చేసుకొని షాకిచ్చిన బ్యూటీ?

by Jakkula Samataha |
జాన్వీ కపూర్‌కు తోడి కోడలుగా స్టార్ హీరోయిన్.. ఎంగేజ్ మెంట్ చేసుకొని షాకిచ్చిన బ్యూటీ?
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉన్నదా అంటే అది సారా అలీఖాన్ సీక్రెట్ ఎంగేజ్ మెంట్ ఇష్యూనే. గత కొన్ని రోజుల నుంచి ఆమె ఓ ధనిక వ్యాపార వేత్తను ప్రేమిస్తుందని, త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతుందంటూ గుస గుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతనితో ఏకంగా నిశ్చితార్థం కూడా జరిగిందంటూ ఓ వార్త బాలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది.





ఇంతకీ సారా పెళ్లి చేసుకోబోయే అతను ఎవరనుకుంటున్నారా? మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా. అయితే ఇదే నిజమైతే ఈ బ్యూటీ, జాన్వీ కపూర్‌కు తోడి కోడలు అవుతుందంట. అది ఎలా అనుకుంటున్నారా? ప్రస్తుతం జాన్వీ మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మరో మనవడు శిఖర్‌తో ప్రేమలో ఉన్న విషయం తానే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆమె శిఖర్ పేరుతో ఉన్న చైన్ వేసుకొని పలు ఈవెంట్‌లో దర్శనం ఇచ్చింది. దీంతో సారా, వీర్ పహారియాను పెళ్లి చేసుకుంటే వీరు తోడి కోడళ్లు అవుతారని నెట్టింట్లో తెగ చర్చ జరుగుతతోంది. కాగా, దీనిపై ఇంకా క్లారిటీ రానుంది. ఎందుకంటే ఇప్పటికే సారా చాలా మందిదో రిలేషన్‌లో ఉందని, ఇంకొంత మందితో ఏకంగా త్వరలో పెళ్లి, నిశ్చితార్థం అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే అవన్నీ పుకార్లులా మిగిలిపోయాయి. అయితే ఇది కూడా ఆ కోవలోకే వెళ్తుందో లేదా నిశ్చితార్థం నిజమై జాన్వీకి తోడి కోడలుగా మారుతుందో చూడాలి అంటున్నారు వారి ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ న్యూస్ అటు బాలీవుడ‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed