క్రేజీ ఆఫర్ పట్టేసిన జాన్వీ.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనుందా?

by Jakkula Samataha |
క్రేజీ ఆఫర్ పట్టేసిన జాన్వీ.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయనుందా?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ, అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో బిగ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆడిపాడనుంది. అంతే కాకుండా,రామ్ చరణ్ సినిమాలో కూడా ఈ అమ్మడు చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు సెట్స్‌పైనే ఉన్నా.. ఈ బ్యూటీ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ పట్టేసినట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు.భారీ అడ్వెంచర్స్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్‌గా జాన్వి కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు కోడైకూస్తున్నాయి. అయితే జాన్వీ టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానం సంపాదించుకోవాలని, బోనికపూర్ హై రికమండేషన్ తో రాజమౌళికి జాన్వి పేరుని సజెస్ట్ చేసినట్లు సమాచారం. దీంతో రాజమౌళి తన సినిమాలో జాన్వీని ఒకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed