- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Barrelakka: ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసిన బర్రెలక్క.. ఆ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయినవా?

దిశ, వెబ్ డెస్క్ : బర్రెలక్క( Barrelakka) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె అసలు పేరు కర్నె శిరీష ( karne shirisha ). తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాపులారిటీ తెచ్చుకున్న ఈ అమ్మాయి ప్రస్తుతం సెలెబ్రిటీ అయిపోయింది. అప్పుడు నిరుద్యోగుల తరపున పోరాడుతా అంటూ పేలిపోయే మాటలు మాట్లాడి, ఇప్పుడేమో అన్నీ మర్చిపోయి వ్లాగ్స్ చేస్తూ బిజీ అయింది. అయితే, బర్రెలక్కకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బర్రెలక్క సొంతూరులో సైలెంట్ ఫాస్ట్ ఫుడ్ అనే సెంటర్ ఓపెన్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై యువత, నెటిజన్స్ రియాక్ట్ అవుతూ మండిపడుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు మర్చిపోయినవా, ఇప్పుడు నీకు జాబ్ అవసరం లేదా అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బర్రెలక్క ( Barrelakka) అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చిందో తెలియదు? ఇప్పుడు ఆమె ఎందుకు ఇలా చేస్తుందో తెలియదు? నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని మాట ఇచ్చి.. ఇప్పుడు ఇలా చేయడం మంచి పద్ధతి కాదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.