- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్‌ను స్మరించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాల్లో తెలుగుజాతి ఖ్యాతి పెంచిన దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లో పాల్గొని ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నారు. ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. ఈరోజు (మే 28) ఆయన శతజయంతి సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు. ‘‘చరిత మరువని నటనా కౌశలం. తెలుగు నుడికారంపై మమకారం. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్పురణకు ఒకే ఒక పేరు శ్రీ నందమూరి తారక రామారావు గారు.
ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది. ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా దాటారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన శ్రీ ఎన్టీఆర్ రామారావు గారు తెలుగు బిడ్డగా జన్మించారు. తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నిరాజనాలు అర్పిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చారు.
Also Read: ‘మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా’ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..
ఇంటికి వచ్చి మరీ క్షమాపణలు చెప్పారు.. దివంగత ఎన్టీఆర్‌పై విజయ శాంతి ట్వీట్ వైరల్