JAILER : అరుదైన రుగ్మతతో బాధపడుతున్న రజనీకాంత్?

by sudharani |   ( Updated:2023-12-17 15:09:45.0  )
JAILER : అరుదైన రుగ్మతతో బాధపడుతున్న రజనీకాంత్?
X

దిశ, సినిమా : తలైవా రజనీకాంత్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘జైలర్’ ట్రైలర్ వచ్చేసింది. ఫస్ట్ టు ఎండ్ ఇంట్రెస్టింగ్‌గా సాగిన ట్రైలర్‌లో.. రజనీకాంత్ వింత మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. పిల్లిలా ఉన్న వ్యక్తి ఒకేసారి పులిగా మారుతాడని ముందే చెప్తుంటాడు డాక్టర్. అన్నట్లుగానే ఫస్ట్ సైలెంట్‌గా కనిపించిన సూపర్ స్టార్.. తర్వాత పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టేశాడు. సినిమా యూనిక్ కంటెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తుండగా.. ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని సన్ టీవీ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.

Advertisement

Next Story