ఐదు రోజుల్లో దిమ్మతిరిగే వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టిన ‘జైల‌ర్’

by samatah |   ( Updated:2023-08-15 06:54:15.0  )
ఐదు రోజుల్లో దిమ్మతిరిగే వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టిన ‘జైల‌ర్’
X

దిశ, సినిమా: కోలివుడ్ స్టార్ హీరో ర‌జ‌నీకాంత్ తాజాగా ‘జైల‌ర్’ మూవీతో వచ్చి బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ములేపుతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ను పండిస్తోంది. కాగా సోమ‌వారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల వ‌ర‌కు క‌లెక్షన్స్ రాబట్టగా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 48 కోట్ల క‌లెక్షన్స్ వ‌చ్చాయి. ఓవ‌ర్‌సీస్‌లో ఇప్పటివ‌ర‌కు రూ.150 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లను రాబ‌ట్టింది. త‌మిళ‌నాడులో రూ.100 కోట్లు, క‌ర్ణాట‌క‌లో రూ.37 కోట్లు, కేర‌ళ‌లో రూ. 28 కోట్లు సాధించింది. ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో రూ.350 కోట్ల గ్రాస్‌ను, రూ.173 కోట్లకుపైగా షేర్‌ను రాబ‌ట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.120 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ కాగా ఐదు రోజుల్లోనే రూ.50 కోట్ల వ‌ర‌కు నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చిపెట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Read More: ఆ పార్ట్స్ చూపిస్తూ రింగులు రింగులుగా పొగ వదులుతూ కైఫ్ ఎక్కిస్తున్న రీతూ

Advertisement

Next Story