హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జగపతి బాబు

by Prasanna |   ( Updated:2023-11-18 09:04:43.0  )
Jagapathi Babu Sensational Comments On Politics
X

దిశ, సినిమా: సీనియర్ హీరో జగపతి బాబు గురించి పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలతో అలరించి.. ప్రస్తుతం టాలీవుడ్ లో విలక్షణమైన విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. ఇక ఆయన విలన్ గా చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఫ్యామిలీ స్టార్ గా అభిమానులని సొంతం చేసుకున్న జగపతి బాబుకు వైవిధ్యమైన పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఒక్క తెలుగులోనే కాదు.. హిందీ, మలయాళం, తమిళ చిత్రాల్లో సైతం జగపతి బాబు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆయన నటనకు ఫిదా అయిన హాలివుడ్ మేకర్స్ అక్కడ నటించాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని జగపతి బాబు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.. ‘నన్ను హాలీవుడ్ పిలుస్తోంది.. ఏమంటారు..?’ అని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన జగపతి ఫ్యాన్స్ ఆశ్చర్యంతోపాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘హాలీవుడ్ ఎంట్రీకి మీరు అర్హులు..సార్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ‘మిమ్మల్ని హాలీవుడ్ భరించగలదా' అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story