Jagapathi Babu: ఫారిన్ లో ఆ పని చేస్తున్న జగపతి బాబు.. వీడియో చూసి షాకవుతున్న నెటిజెన్స్

by Prasanna |   ( Updated:2024-07-22 13:33:15.0  )
Jagapathi Babu: ఫారిన్ లో ఆ పని చేస్తున్న జగపతి బాబు.. వీడియో చూసి షాకవుతున్న నెటిజెన్స్
X

దిశ, సినిమా: జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. పాత్ర ఏదైనా పాత్రకి న్యాయం చేయగల సత్తా ఉన్న నటుడు జగ్గూ భాయ్. ఒకప్పుడు స్టార్ హీరో కానీ, ఇప్పుడు బెస్ట్ విలన్, బెస్ట్ ఫాదర్ రోల్స్ లో కనిపిస్తూ అందర్ని అలరిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘కల్కి 2898AD’ .

ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం మనకి తెలిసిందే. మైథలాజికల్ ఫిక్షనల్ గా వచ్చిన ఈ మూవీ రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇదిలా ఉండగా కల్కి విజయాన్ని హీరో జగపతి బాబు చీర్స్ కొట్టి ఫారిన్ లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. జగ్గూభాయ్ షేర్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. మందు బాటిల్‌ ని షేక్ చేస్తూ ప్రభాస్‌ కి, కల్కి టీమ్‌కు చీర్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.

ఈ వీడియో చూసిన నెటిజెన్స్ మీ స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మీ ఇద్దరూ కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాని ఊపేస్తోంది.

Advertisement

Next Story