అర్థరాత్రి వీడియోకాల్ చేసి నరకం చూపించాడు : Sukesh పై Jacqueline ఆరోపణలు

by Prasanna |   ( Updated:2023-01-20 12:05:31.0  )
అర్థరాత్రి వీడియోకాల్ చేసి నరకం చూపించాడు : Sukesh పై Jacqueline ఆరోపణలు
X

దిశ, సినిమా : ప్రముఖ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మరోసారి సుఖేశ్‌ చంద్రశేఖర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఢిల్లీ పటియాల కోర్టుకు సమర్పించిన స్టేట్‌మెంట్‌లో ఆ ఆర్థిక మోసగాడు తన జీవితాన్ని నరకప్రాయం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'సుఖేశ్‌ నా ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. నా కెరీర్‌, జీవనోపాధిని పూర్తిగా నాశనం చేసేందుకు ప్లాన్ చేశాడు. తాను సన్‌ టీవీ యజమానినని, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బంధువునంటూ మోసం చేశాడు. అంతేకాదు నాకు పెద్ద అభిమానినని నమ్మించి దక్షిణాదిలో పెద్ద సినిమా చేస్తానని చెప్పాడు. అలా ప్రతిరోజు ఏదో ఒక కారణంతో నాతో వీడియో కాల్స్‌ మాట్లాడేవాడు. షూటింగ్‌కు వెళ్లే ముందు, షూటింగ్‌లో ఉన్నప్పుడు, రాత్రి ఇంటికి వచ్చాక కూడా ఫోన్లు చేసి ఏవేవో కబుర్లు చెప్పేవాడు. ఇటీవల కూడా జైల్లో ఉన్న విషయం చెప్పకుండానే నాకు ఫోన్లు చేస్తూ నన్ను కూడా కేసులో ఇరికించాలని చూశాడు' అంటూ తన ఆవేదనను వ్యక్తపరిచింది.

ఇవి కూడా చదవండి : ఆ బోల్డ్ ఫొటోలు చూసి షాక్ అయ్యాను: Avika Gore


Advertisement

Next Story