సర్జరీ కోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ కమెడియన్.. (వీడియో)

by sudharani |   ( Updated:2023-08-29 05:40:30.0  )
సర్జరీ కోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ కమెడియన్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోలలో ‘జబర్ధస్త్’ ఒకటి. ఈ షో ఎంతో మందిని నవ్వించడమే కాకుండా.. మారుమూలన ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లకు లైఫ్‌ను ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. అలాంటి వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకడు. జబర్ధస్త్‌లో నవ్వులు పూయించే ప్రతి కమెడియన్ వెనుక ఎంతో కష్టం దాగి ఉన్నట్లు.. తన వెనుక కూడా ఎంతో కష్టం ఉందని చెప్పుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యాడు.

‘‘ఎంత మంది ఎన్ని రకాలుగా నన్ను విమర్శించిl.. ఆర్టిస్ట్‌గా నేను చేయగలిగింది చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఇల్లు కొనుకున్నారు. కానీ ఇప్పుడు అది అమ్మేయాలని అనుకుంటున్నా. మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు. వెంటనే ఆపరేషన్ చేయించాలి. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం అమ్మ తెలిస్తే ఒప్పుకోదు. అమ్మ కంటే నాకు ఏది ముఖ్యం కాదు’’ అని చెప్పుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో నెటిజన్లు శాంతి స్వరూప్‌కి ధైర్యం చెబుతున్నారు.

Advertisement

Next Story