ప్రాణం పెట్టి నటించినా అవార్డ్ దక్కలేదు.. బాధగా ఉందంటున్న Anupam Kher

by sudharani |   ( Updated:2023-10-28 12:00:51.0  )
ప్రాణం పెట్టి నటించినా అవార్డ్ దక్కలేదు.. బాధగా ఉందంటున్న Anupam Kher
X

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ‘ది కశ్మీర్ ఫైల్స్’లో తను పోషించిన పాత్రకు జాతీయ అవార్డు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఉద్దేశిస్తూ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘నేషనల్ అవార్డ్ రాకపోవడం నన్నెంతో బాధించింది. ఇందులో నా ప్రాణం పెట్టి నటించాను. ఉద్వేగభరితమైన పాత్ర పోషించా. ఎక్కడా ఫేక్ ఎమోషన్స్ చూపించలేదు. నా అద్భుతమైన నటనకు జాతీయ అవార్డ్ పొందే అర్హత ఉంది. ఎవరేమనుకున్నా ఈ బాధను తెలియజేసే హక్కు నాకు ఉంది’ అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. చివరగా అల్లు అర్జున్ నటన బాగుందని, అర్హులైన వాళ్లందరికీ అవార్డ్ దక్కినందుకు సంతోషంగా ఉందన్నాడు అనుపమ్.

Next Story