Dasara Movie: అప్పుడే ‘దసరా’ పైరసీ.. నాని కష్టమంతా వృధా

by Prasanna |   ( Updated:2023-04-01 06:54:29.0  )
Dasara Movie: అప్పుడే  ‘దసరా’ పైరసీ..  నాని కష్టమంతా వృధా
X

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ‘దసరా’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రొటీన్‌కి భిన్నంగా ఇప్పటి వ‌ర‌కు ట‌చ్ చేయ‌ని కాన్సెప్ట్‌తో ఈ సినిమాలో కనిపించాడు నాని. ఇక థియేటర్లో సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌లో చూడాల్సిన సినిమాను.. వెబ్‌సైట్లో పెట్టేసి.. నాని కష్టాన్ని బజార్‌నా పడేసారు. మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది అనుకుంటున్నా టైం లో.. ఈ పైరసీ భూతం తాజాగా నాని సినిమాను కూడా పట్టుకుంది. పుల్ మూవీ ఇప్పుడు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంది. అది కూడా ఫుల్ హెచ్‌ డీ ఫార్మాట్లో.. ఎక్కడో కాదు.. పైరసీ మూవీస్‌కు అడ్డాగా మారిన కొన్ని సైట్లు.. మూవీ రూల్స్‌, తమిళ్ రాకర్స్‌, పైరేటెడ్‌ టోరెంట్స్‌లలో! ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. పాపం నాని మూవీ కోసం పడిన కష్టానికి, కనీసం వన్ వీక్ అయిన.. లాభం లేకుండా పోయాయి. మరి దీని గురించి మూవీ యూనిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: OTT: ఏప్రిల్ నెలలో ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!

Advertisement

Next Story