- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాపం నాగచైతన్య.. అప్పుడు సమంత కోసం ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం త్యాగాలు !
దిశ, సినిమా: ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య అందరికీ సుపరిచితమే. తర్వాత ‘ఏమాయ చేశావే’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన సమంతాతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల రీత్యా పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల అనంతరం ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆ క్రమంలోనే చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య ‘తండేల్’ మూవీలో నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం చై కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది విన్న నెటిజన్లు అయ్యో పాపం చై అని తెగ కామెంట్లు చేస్తున్నారు. అసలు మ్యాటర్‌లోకి వెళితే..
సోషల్ మీడియాలో ఎంతటి హ్యూజ్ ట్రోలింగ్ జరిగినా సరే ఎవరిని కూడా వేలెత్తి చూపించకుండా తన పని తాను చూసుకపోతూ ఉంటాడు నాగచైతన్య. అయితే ‘ఏమాయ చేసావే’ సినిమా టైంలో నాగచైతన్య చాలా రిస్క్ చేశాడంట. అప్పుడప్పుడే కెరీర్‌లో సెటిల్ అవుతూ ఉన్న నాగచైతన్య ..ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర హైలెట్ అవుతుంది అని తెలిసినా కూడా హీరోగా నటించాడు. అయితే ఆ టైం లో సమంత పేరు మారుమ్రోగి పోవడానికి కారణం నాగచైతన్య అంటూ బాగా ప్రచారం జరిగింది కూడా. అయితే ఇప్పుడు అదే తప్పును మరోసారి చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
నాగచైతన్య ప్రెసెంట్ ‘తండేల్’ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ కన్నా సాయి పల్లవి క్యారెక్టర్ ని హైలైట్ గా ఉండబోతుందట. ఆ విషయం నాగచైతన్యకి కూడా బాగా తెలుసు అంట. అయితే ఏమాయ చేసావే సినిమాకి తీసుకున్న డెసీషన్ నే ఈ సినిమాకి తీసుకున్నాడు నాగచైతన్య అంటూ ప్రచారం జరుగుతుంది. తన క్యారెక్టర్ హైలెట్ కాకపోయినా పర్లేదు తన మనసుకు నచ్చిన పాత్ర చేయాలి అంటూ డిసైడ్ అయ్యి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారట. దీంతో అప్పుడు సమంత కోసం ఇప్పుడు సాయి పల్లవి కోసం నాగచైతన్య తీసుకున్న నిర్ణయం నెట్టింట వైరల్ గా మారింది.