పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదేరోజు!

by GSrikanth |   ( Updated:2023-04-02 05:10:26.0  )
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదేరోజు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకలి మీద ఉన్న సింహానికి వేటలో మాంచి జింక దొరికితే ఏం జరుగుతుందో.. సరిగ్గా ఆ రోజు అదే జరిగింది. హిట్ కోసం పదేళ్లు వెయిట్ చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు జల్సా సినిమా ఆకలి తీర్చింది. పదేళ్ల గడ్డు పరిస్థితిని మర్చిపోయేలా చేసింది. జల్సా సినిమా విడుదలై నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తైంది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆకలి మీద ఉన్న అభిమానులకు మాంచి బిర్యానీ లాంటి సినిమా అందించారని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఒక్కసారిగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌ అంతా సోషల్ మీడియాలో పోస్టులతో అటాక్ చేయడంతో దెబ్బకు ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాగా, జల్సా సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ఇలియానా నటించింది. అద్భుతమైన మ్యూజికల్ హిట్ అయిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.

ఇవి కూడా చదవండి: ‘రావణాసుర’ ప్రమోషన్స్‌లో మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేసిన రవితేజ?








Advertisement

Next Story

Most Viewed