సమంతను పక్కన పెట్టేసిన చిత్ర పరిశ్రమ..ఆ ఇద్దరు హీరోయిన్స్‌కే ఆఫర్స్?

by Jakkula Samataha |   ( Updated:2024-05-15 03:32:33.0  )
సమంతను పక్కన పెట్టేసిన చిత్ర పరిశ్రమ..ఆ ఇద్దరు హీరోయిన్స్‌కే ఆఫర్స్?
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అందం, అభినయం ఈమె సొంతం. ఇక ఎప్పుడూ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా బీజీగా ఉంటుంది. అయితే ఈ మధ్య సమంత ఎక్కువగా ట్రోలింగ్‌కు గురి అవుతున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అయితే సమంతకు ప్రస్తుతం సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తలేవు. ఒకటో రెండో ప్రాజెక్ట్స్ తప్ప ఈ అమ్మడు చేతిలో ఏ భారీ ప్రాజెక్ట్స్ లేవు. అయితే టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోతే హీరోయిన్స్ బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికీ చాలా మంది బాలీవుడ్‌లో తమ సత్తా చాటుతూ.. నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంటున్నారు. కానీ సమంతకు మాత్రం బాలీవుడ్ నుంచి ఎలాంటి పిలుపు లేదు. ఈ అమ్మడుకు ముంబై‌లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి పరిచయాలు ఉన్నాయి. అయినా ఆఫర్స్ మాత్రం వరించడం లేదు అంటున్నారు నెటిజన్స్.

రష్మిక యానిమల్ సక్సెస్‌తో పాటు, రెండు మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. అలాగే కీర్తి సురేష్, మైదాన్ సినిమాతో సక్సెస్ అందుకోగా, మరో ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అలాగే సాయిపల్లవి కూడా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కానీ సమంతకు మాత్రం బాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫర్స్ లేవు. ఆమె ఎంత ప్రయత్నించినా తనకు అక్కడి నుంచి ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు. దీంతో బాలీవుడ్ సమంతను కావాలనే పక్కనపెట్టింది. వారి కన్ను మొత్తం సాయి పల్లవి, కీర్తి సురేష్ మీదే ఉన్నదంటున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story