రాజమౌళితో సిట్టింగ్ సక్సెస్ అయినట్టేనా.. వైరల్ అవుతున్న మహేష్ బాబు న్యూ హెయిర్ స్టైల్

by Prasanna |   ( Updated:2024-04-19 07:16:34.0  )
రాజమౌళితో సిట్టింగ్ సక్సెస్ అయినట్టేనా..  వైరల్ అవుతున్న మహేష్ బాబు న్యూ హెయిర్ స్టైల్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మహేష్ బాబు తన ఫ్యామిలీతో చాలా రోజులు రిలాక్స్ అయిన విషయం తెలిసిందే. అయితే మహేష్ బాబు, రాజమౌళి కలిసి దుబాయ్‌లో సిట్టింగ్ వేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వీరిద్దరూ ఎయిర్‌పోర్టులో కలిసి కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సిట్టింగ్ కంప్లీట్ అయి షూటింగ్ ప్రారంభం కానుండడంతో సూపర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాజమౌళి సినిమా కోసమే మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఇప్పుడు వైరల్ గా మారింది. గడ్డం, పొడవాటి జుట్టుతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు. మొత్తానికి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి, మహేష్ బాబు కలిసి ఉన్న ఫోటోలు అభిమానులు బాగానే ట్రెండ్ చేస్తున్నారు. అయితే SSMB 29 సినిమా కోసమే వీరిద్దరూ దుబాయ్‌లో కలిశారని టాక్ నడుస్తుంది. జక్కన్న చెప్పిన కథతో మహేష్ ఇక తన నెక్స్ట్ షూటింగ్‌లో కలుస్తాడని అందరూ అనుకుంటున్నారు. దీనిలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed