- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వేణు స్వామి చెప్పిందే నిజమా..వరుణ్, లావణ్యలను విడగొట్టడానికి అలా ట్రై చేస్తున్న మెగా లేడీ ఈమేనా?
దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉన్నదా అంటే అది లావణ్య, వరుణ్ తేజ్ విడాకుల వార్తనే. సెలబ్రిటీస్, రాజకీయ నాయకుల జీవితాలకు సంబంధించిన జాతకాలు చెప్పడంలో వేణుస్వామి ముందుంటాడు. ఆయన సెలబ్రిటీస్‌ల జీవితాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఓపెన్‌గా చెప్పేస్తుంటాడు. అయితే తాజాగా ఈయన మెగా క్యూట్ కపుల్ లావణ్య, వరుణ్‌లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళితే.. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న మెగా జంట వరుణ్, లావణ్య. వీరు చాలా సంతషంగా వారి మ్యారేజ్‌లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వరుణ్, లావణ్యల జాతకాలు అస్సలే కుదరలేదు. వీరికి వివాహం కలిసిరాదు, వారు ఓ మెగా లేడీ వలన విడిపోవడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు.
అయితే దీంతో సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. అసలు వరుణ్, లావణ్యలను విడగొట్టే ఆ మెగా లేడి ఎవరా అని నెటిజన్స్ తెగ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే నిహారిక వల్లే వరుణ్, లావణ్య విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీరిని విడగొట్టే ఛాన్స్ ఎవరికీ లేదు, ఎందుకంటే? నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చి సింగిల్‌గా ఉంటుంది. ఈమె ఏవైనా గొడవలు సృష్టిస్తే వారు విడిపోయే ఛాన్స్ ఉన్నదంటూ చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఇదంతా ఫేక్..వేణు స్వామి చెప్పినవన్నీ నిజమయ్యాయా? ఆయన ఏ పనిలేక చెప్తాడు, అంత మాత్రనా వరుణ్ లావణ్యలు విడిపోతారా? వారిది ట్రూ లవ్. వారు ఎప్పటికీ వీడిపోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.