కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు : మాజీ ఎమ్మెల్యే ఆల

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు : మాజీ ఎమ్మెల్యే ఆల
X

దిశ,దేవరకద్ర: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే విద్యుత్ కోతలు తాగునీటి సమస్యలు తలెత్తాయని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లి, గోపన్ పల్లి ,గూరకొండ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రైతులకు సమస్యలు మొదలయ్యాయాన్ని అన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడొ ఐదు నెలలు కావస్తున్నా రైతుల గురించి ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.

కేసీఆర్ హయంలోనే రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో రైతులకు సకాలంలో రైతుబంధు, రుణమాఫీ, నిరంతరం కరెంటు ఇచ్చారు. ఈ సర్కారు రైతులను గాలికి వదిలేసిందని, ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని కాపాడుకున్న పంటను కూడా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలందరూ బ్యాలెట్ నమూనాలో క్రమ సంఖ్య 3 పై కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర బిఆర్ఎస్ నాయకులు జెట్టి నరసింహారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, డోకూరు నరేందర్ రెడ్డి ,దొబ్బలి అంజనేయులు, పరమేష్,గోపాల్ దేవరకద్ర మండల బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed