స్పీచ్ మధ్యలో ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ పైకి చూపించిన ఫ్యాన్స్.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!

by sudharani |   ( Updated:2024-05-04 14:43:00.0  )
స్పీచ్ మధ్యలో ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ పైకి చూపించిన ఫ్యాన్స్.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అటు అధికార పార్టీ నేతలు, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రచారాల్లో బిజీగా ఉన్నాడు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన.. నేడు గుడివాడలో పర్యటిస్తున్నారు. గుడివాడలో టీటీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము తరపున ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్.. మీటింగ్ మధ్యలో ఎన్టీఆర్ అభిమానుల గురించి కామెంట్స్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ‘కొడాలి నాని నోరు పారేసుకునే వ్యక్తి. ఆయన నోరు కట్టడి చేయాలంటే రాముని గెలిపించాలి. వైసీపీ ప్రభుత్వం దాడులు, దోపిడీ ప్రభుత్వం. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లో అందరికీ సాధ్యం కాదని.. జనసేనను కాపాడటానికి కాదు ఏపీ బాగు కోసం వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కల్యాణ్ స్వీచ్ ఇస్తున్న సమయంలో.. జనంలో కొంత మంది ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ పైకి ఎత్తి చూపించారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. ‘నాకు ఎన్టీఆర్ ఫ్లాకార్డ్స్ కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు, అందరి హీరోల అభిమానులకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు.

Read More..

ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

Advertisement

Next Story