- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోనాల్, అఖిల్ బంధం తెగిపోయిందా.. అలాంటి పరిస్థితిల్లో బిగ్ బాస్ బ్యూటీ!
దిశ, సినిమా : బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన అందంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా హౌస్‌లో ఆమె ప్రేమాయణంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో చివరి వరకు కొనసాగింది. అయితే ఈమె అఖిల్‌తో చాలా క్లోజ్‌గా ఉండేది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈమె తనఅకిల్‌తో కలిసి పలు ఈవెంట్స్‌కు అటెండ్ అవ్వడంతో నిజంగా వీరు లవ్‌లో ఉన్నారు అని చాలా మంది కన్ఫామ్ చేసుకున్నారు.
మొదట్లో మోనాల్ అభిజిత్, అఖిల్ ఇద్దరితో ప్రేమాయణం కొనసాగించినట్లు కనిపించినా, చివరకు అఖిల్‌తో ఆమె క్లోజ్‌గా మూవ్ అవుతూ వచ్చింది. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక హౌస్ నుంచి వచ్చిన తర్వాత అందరూ మోనాల్ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది, ఈమెకు మంచి మంచి అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు, కానీ ఆమె పలు డ్యాన్స్ షోలో జడ్జీగా కనిపించింది తప్పితే, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవీ చేసి ధాఖలాలు లేవు.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందంట. టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఈ నటి గుజరాతీలో పలు సినిమాలు తీస్తూ గడిపేస్తుందంట. ఆమె కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, అఖిల్ కూడా దూరం అయినట్లు పలు వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.