విడిపోయిన మరో స్టార్ కపుల్.. పుట్టినరోజు సాక్షిగా..

by Sujitha Rachapalli |
విడిపోయిన మరో స్టార్ కపుల్.. పుట్టినరోజు సాక్షిగా..
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ బర్త్ డే సందర్భంగా కపూర్ కజిన్స్ అందరూ కలిశారు. కరెక్ట్ గా పన్నెండు గంటలకు కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. కో స్టార్స్ కూడా విష్ చేస్తూ సోషల్ మీడియాలో స్టేటస్ లు పెట్టారు. కానీ ప్రియురాలు మలైకా అరోరా మాత్రం కామ్ గా ఉండిపోయింది. యోగా, ఫిట్ నెస్ గురించి పోస్టులు పెట్టిన ఆమె.. అర్జున్ పుట్టినరోజున విష్ మాత్రం చేయలేదు. దీంతో ఇన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ నిజమే అంటున్నారు నెటిజన్లు. దాదాపు 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న వీరిద్దరు ఇన్నాళ్లు డేటింగ్ చేసి.. ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకున్నారనే నిర్ధారణకు వచ్చేశారు.

కాగా మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయనతో విడాకులు తీసుకున్నాక అర్జున్ తో డేటింగ్ చేసింది. ఇక ఆర్బాజ్ మలైక తర్వాత ఒకరితో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చెప్పేశాడు. ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Advertisement

Next Story

Most Viewed