60 ఏళ్ల వయసులో ఇంత రిస్క్ అవసరమా.. స్టార్ హీరోపై నెటిజన్లు ఫైర్ (వీడియో)

by sudharani |   ( Updated:2023-07-28 05:50:19.0  )
60 ఏళ్ల వయసులో ఇంత రిస్క్ అవసరమా.. స్టార్ హీరోపై నెటిజన్లు ఫైర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో హీరోలు ఫిట్ నెస్‌పై ఫోకస్ ఎక్కువగా పెడుతున్నారు. ఎక్కువ సమయం జిమ్‌లోనే గడుపుతున్నారు. యంగ్ హీరోలే ఇలా చేస్తున్నారు అనుకుంటే అది మనపొరపాటే.. 50, 60 ఏళ్లు దాటిన ఆగ్ర హీరోలు సైతం ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో వర్కౌట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న 63 ఏళ్ల స్టార్ హీరో కూడా కుర్రాళ్లే భయపడిపోయేలా రిస్కులు చేస్తున్నారు. ఇంతకి ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..?

మలయాళంలో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న మోహన్ లాల్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం జిమ్‌లో వర్కౌట్‌లు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటున్న మోహన్ లాల్.. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఫొటోలు షేర్ చేశారు మోహన్ లాల్. కానీ, ఆ ఫొటోలు చూసిన అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఏకంగా 100 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ కనిపించారు. దీంతో 63 ఏళ్ల వయసులో మీరు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారు అంటూ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story