నమ్రత డ్రెస్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ..? ఆమె దుస్తుల ఫొటోలు వైరల్

by Anjali |   ( Updated:2023-06-07 14:24:20.0  )
నమ్రత డ్రెస్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ..? ఆమె దుస్తుల ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా పేరు దక్కించుకున్న వారిలో నమ్రతా శిరోద్కర్ - మహేష్ బాబు ఒకరు. అయితే తాజాగా.. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర్ పార్టీకి ప్రిన్స్ ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ఈ పార్టీలో నమ్రత గ్రాఫిక్ డిజైన్‌తో కూడిన కుర్తా‌లో వచ్చి.. సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకలో పాల్గొన్న ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఆమె ధరించిన డ్రెస్‌పై నెట్టింట చర్చ మొదలైంది. ఈ ప్రత్యేకమైన జార్జియో అర్మానీ కుర్తాలో నమ్రతా మేడమ్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ కుర్తాకు దాదాపుగా రూ. 4 లక్షలు ఉంటుదని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.


Also Read..

ఈ సిరీస్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: మైత్రేయి

Advertisement

Next Story