Indra Movie: ‘ఇంద్ర’ రీ రిలీజ్.. థియేటర్స్‌ వద్ద రచ్చ చేస్తున్న అంకుల్స్

by Prasanna |
Indra Movie:  ‘ఇంద్ర’ రీ రిలీజ్.. థియేటర్స్‌ వద్ద రచ్చ చేస్తున్న అంకుల్స్
X

దిశ, సినిమా : ఈ మధ్య ఏ హీరో పుట్టిన రోజు అయినా సరే.. వారి పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ కొత్త ట్రెండ్ అయితే క్రియోట్ చేసారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిరు సినీ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఇంద్ర మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేసారు. ఈ చిత్రం అప్పట్లోనే పెద్ద విజయం సాధించింది.. ఇప్పటికి మెగా అభిమానులు విజిల్స్ వేస్తూ అదే జోష్ లో కనిపిస్తున్నారు. కానీ, ఈ సారి స్పెషల్ ఏంటంటే సీనియర్ అభిమానులు మొత్తం బయటకు వచ్చారు.

చిరంజీవి 80, 90 స్ లో కూడా స్టార్ హీరో స్టేటస్ సంపాదించిన హీరో. అప్పట్లో ఉన్న యూత్ అయితే, టికెట్స్ కోసం గంటలు తరబడి క్యూలైన్లలో నిలుచునే వారు. కానీ, ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారిపోయింది. మొత్తం ఆన్లైన్ లోనే పనులు మొత్తం జరుగుతున్నాయి.

చిరుకి ఈ జనరేషన్ ఫ్యాన్స్ కంటే 80 స్ వాళ్లలోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంద్ర మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కావడంతో సీనియర్ అభిమానులు మొత్తం థియేటర్స్ కి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో యూత్ హంగామ చేస్తే ఇంద్ర మూవీకి అంకుల్స్ థియేటర్ వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Fore Video : https://x.com/DineshYash8/status/1826440082074861861

Advertisement

Next Story

Most Viewed