'సమస్యల నుంచి బయటపడ్డ Indian 2 సినిమా'

by sudharani |   ( Updated:2022-08-20 04:50:11.0  )
సమస్యల నుంచి బయటపడ్డ Indian 2 సినిమా
X

దిశ, వెబ్‌డెస్క్: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా.. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న సినిమా 'ఇండియన్-2'. భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత.. కొన్ని ప్రమాదాలు, దర్శకుడికి, నిర్మాతలకు మధ్య వచ్చిన వివాదాల కారణంతో షూటింగ్ ఆగిపోయింది. అయితే దీనికి సంబంధించిన సమస్యలు సర్థుమణిగినట్టు తెలుస్తోంది. దీంతో ఇండియన్ 2 తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 25 నుంచి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడట. కాగా.. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా, రకుల్ కీలక పాత్రలో కనిపించనుంది.

Advertisement

Next Story