అద్దంకి దయాకర్ హీరోగా వస్తున్న సినిమాకు పేరు ఫిక్స్.. రాజకీయ వర్గాలను షేక్ చేస్తోన్న మూవీ నేమ్ !

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-07-08 10:01:13.0  )
అద్దంకి దయాకర్ హీరోగా వస్తున్న సినిమాకు పేరు ఫిక్స్.. రాజకీయ వర్గాలను షేక్ చేస్తోన్న మూవీ నేమ్ !
X

దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ హీరోగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్ సరసన సీనియర్ నటి ఇంద్రజ నటిస్తున్నారు. బొమ్మకు క్రియోషన్న్ పతాకంపై బొమ్మక్ మురళి దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ ఐదు భాషల్లో నిర్మిస్తున్నారు. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలు ఈ మూవీలు ఉంటాయని గతంలోనే హీరో అద్దంకి దయాకర్ ప్రకటించారు. ఈ మూవీలో అద్దంకి దయాకరే కాకుండా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌తోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు నటిస్తున్నారు. ప్రజా యుద్ధ నౌక, గాయకుడు, రచయిత గద్దర్, సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం.

కాగా, ఈ మూవీపై హీరో అద్దంకి దయాకర్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జూలై 10న ప్రసాద్ ల్యాబ్‌లో చిత్రబృందం నిర్వహిస్తోందని ప్రకటించారు. పాన్ ఇండియాగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు భాషలో ఆడియో విడుదల కార్యక్రమానికి శ్రేయోభిలాషులందరరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు అద్దంకి తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమాకు ‘ఇండియా ఫైల్స్’ పేరును ఖరారు చేసినట్లు చిత్ర హీరో దయాకర్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం తన ఫేస్ బుక్ పేజీలో ‘ఇండియా ఫైల్స్’ పోస్టర్‌ను పోస్ట్ చేశారు. భారతదేశ CULTURAL DNA పై విడుదల కాబోతున్న భారతదేశపు తొలి సినిమా ‘ఇండియా ఫైల్స్’ అంటూ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం చూశాం కానీ రాజకీయ నేతే సినిమా హీరోగా మారడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి కావచ్చు. మూడేళ్లగా పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు అద్దంకి దయాకర్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీకి తాజాగా ‘ఇండియా ఫైల్స్’ పేరును ఫిక్స్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే కేరళ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలు ఎంతటి వివాదాలకు దారితీశాయో చూశాం. ‘ఇండియా ఫైల్స్’ కూడా ఆ తరహాలోనే ఉండబోతుందని సమాచారం. ‘ఇండియా ఫైల్స్’ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..

Advertisement

Next Story

Most Viewed