‘భగవంత్ కేసరి’ విషయంలో అది మా తప్పే క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..!

by Hamsa |   ( Updated:2023-10-21 05:51:58.0  )
‘భగవంత్ కేసరి’ విషయంలో అది మా తప్పే క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..!
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. దీనిని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించారు. అయితే ఈ మూవీ అక్టోబర్ 19న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఫస్ట్‌ డే కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి అదే ఫామ్‌లో దూసుకుపోతుంది. తాజాగా, భగవంత్ కేసరి సక్సెస్ మీట్ శనివారం చిత్ర యూనిట్ నిర్వహించింది. ఇందులో అనిల్ రావిపూడి ఈ సినిమాలో జరిగిన ఓ చిన్న తప్పు కారణంగా అందరి ముందు క్షమాపణలు చెప్పారు.

అసలు విషయంలోకి వెళితే.. శ్రీ లీల తండ్రి పాత్రలో శరత్ కుమార్ కాసేపు కనిపించారు. జైలర్ రోల్ చేశారని సమాచారం. కానీ ఆయన చనిపోయారని టీవీలో వచ్చినప్పుడు మాత్రం సీఐ అని స్క్రోలింగ్ వేస్తారు. ఇదే విషయంపై అనిల్ రావిపూడికి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన మాట్లాడుతూ.. ‘‘ పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం గొప్ప విషయం. మీ సునిశీత పరిశీలన, సూక్ష్మ బుద్దికి హాట్సాఫ్, జైలర్‌ని సీఐ అని న్యూస్ చెప్పడం మా తప్పే. మా వాళ్ళు పొరపాటుగా అలా వేసి ఉంటారు. అందుకు క్షమాపణలు చెబుతున్నాను’’ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

Read More: అభిమానులతో కలిసి ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చూసిన Ravi Teja పిల్లలు.. వీడియో వైరల్

Advertisement

Next Story