Rajasab : పండగ వాతావరణాన్ని తలపిస్తున్న ప్రభాస్ ఫస్ట్ లుక్..

by Anjali |   ( Updated:2024-01-15 12:20:02.0  )
Rajasab : పండగ వాతావరణాన్ని తలపిస్తున్న ప్రభాస్ ఫస్ట్ లుక్..
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- డైరెక్టర్ మారుతి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ మూవీకి ‘ది రాజా సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు.

ఇక ఫస్ట్‌ లుక్‌లో ప్రభాస్.. నల్ల చొక్కా, లుంగీ ధరించి మాస్ గెటప్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. రెబల్ స్టార్ ఫస్ట్ లుక్ పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు

Advertisement

Next Story