Chandramukhi 2: ఆకట్టుకుంటున్న'చంద్రముఖి 2' టైటిల్ పోస్టర్..

by Manoj |   ( Updated:2022-06-15 07:10:34.0  )
Lyca Productions Shares Chandramukhi Title Poster
X

దిశ, వెబ్‌డెస్క్: Lyca Productions Shares Chandramukhi Title Poster| సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నయనతార, జ్యోతిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'చంద్రముఖి'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. 2005 లో విడుదలైన ఈ చిత్రం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ సెన్సేషన్ సృష్టించింది.

అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. హీరోగా రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రల్లో చంద్రముఖి2 రాబోతుందంటూ ట్విట్టర్ ద్వారా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చంద్రముఖి2 లో రాఘవ నటిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed