ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి.. కంగనా పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-05-19 13:14:51.0  )
ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి.. కంగనా పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ.. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతా ఉంటుంది. ఈ క్రమంలోనే మరోసారి కంగనా రనౌత్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈరోజు కంగనా 36 వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్న కారణంగా తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.

అందులో ‘‘నా శత్రువులు నాకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. నేను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదు.. నా కాళ్లపై నేను నిలబడి విజయం సాధించేలా చేశారు. ఎలా పోరాడాలో నేర్పించారు. నన్ను సపోర్ట్ చేసే వారికి.. నా వెంట ఉండి నడిపించిన వారందరికీ నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. ఫ్రెండ్స్ నా సిద్ధాంతాలు, ప్రవర్తన, ఆలోచనలు చాలా సాధారణం. అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. దేశ సంక్షేమం కోసం మాట్లాడుతూ నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే అలాంటి వారందరికీ నా క్షమాపణలు’’ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story