డేట్ నైట్ అంటూ బాయ్‌ఫ్రెండ్ ఫొటో రివీల్ చేసిన ఇలియానా.. షాక్‌లో ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2023-07-17 07:02:46.0  )
డేట్ నైట్ అంటూ బాయ్‌ఫ్రెండ్ ఫొటో రివీల్ చేసిన ఇలియానా.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: గోవా బ్యూటీ ఇలియానా ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు ‘పోకిరీ’ చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే ఇటీవల ఈ అమ్మడు పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ తో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించి మాత్రం బయపడలేదు. ప్రస్తుతం ఇలియానా 9 నెలల గర్భంతో ఉంది. ఆ క్రమంలో సోషల్ మీడియాలో పలు పోస్టులు చేసినప్పటికీ తన బిడ్డకు కాబోయే తండ్రి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది.

తాజాగా, ఇలియానా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తన బాయ్‌ఫ్రెండ్‌కు దగ్గరగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘డేట్ నైట్’ అంటూ క్యాప్షన్‌ను పెట్టింది. అంతేకాకుండా దానికి రెడ్ కలర్ హార్ట్ సింబల్‌ను కూడా జత చేసింది. అతని పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా, గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్‌ మీచెల్‌తో ఇలియానా డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ పుట్టబోయే బిడ్డకు తండ్రి అతనేనని అనుకున్నారు. కానీ, ఇలియానా తాజా పోస్టులో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కానందున నెటిజన్లు అతను ఎవరని షాక్ అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటి లోగా బాయ్‌ఫ్రెండ్ పేరును రివీల్ చేస్తుందో లెదో చుడాలి.

ఇవి కూడా చదవండి: వర్షం పడుతుండగా ప్రియుడితో కారులో అడ్డంగా బుక్ అయిన జాన్వీ కపూర్.. (వీడియో వైరల్)



Advertisement

Next Story

Most Viewed