దమ్ముంటే ఆ పని చెయ్ అంటూ గట్టిగా ఇచ్చిపడేసాడుగా.. యూట్యూబర్‌పై విశ్వక్ సేన్ ఫైర్(పోస్ట్)

by Kavitha |
దమ్ముంటే ఆ పని చెయ్ అంటూ గట్టిగా ఇచ్చిపడేసాడుగా.. యూట్యూబర్‌పై  విశ్వక్ సేన్ ఫైర్(పోస్ట్)
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌పై రివ్యూ ఇస్తున్న ఓ యూట్యూబర్‌పై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వారు చలనచిత్ర పరిశ్రమలో పైరసీ కంటే కూడా ప్రమాదం అని చెబుతూ.. సదరు యూట్యూబర్‌కు విశ్వక్ ఓ ఛాలెంజ్ కూడా విసిరారు. విశ్వక్ చేసిన ఈ కామెంట్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. అది అలా అడుగన్నా అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతకీ విశ్వక్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..

‘‘సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబు పట్టుకొని బయలుదేరుతున్నారు యూట్యూబ్‌లో మీ ఇన్‌కమ్ కోసం. వేల కుటుంబాలు ఆధారపడి ఉన్న ఇండస్ట్రీపై మజాక్‌లు అయిపోయాయి మీకు. వీడు ఒక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం మనం. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్ళు అనుకుని వదిలేద్దాం. ఇలాంటి అభిప్రాయాలు బజారులో పెట్టి తిరిగే వాళ్లంతా 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి.

ఇలాంటి వారు ఉంటే పైరసీ కంటే కూడా చాలా ప్రమాదకరం. ప్రతిరోజు సెట్‌లో ఎంతో మంది తమ రక్తం, చెమటోడ్చి వర్క్ చేస్తారు. ఆ విషయం తెల్వక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు తీయి 10నిమిషాల షార్ట్ ఫిల్మ్‌ని. అప్పుడు నీకు, నీ అభిప్రాయానికి రెస్పెక్ట్ ఉంటుంది. ఆవేశంలో నేను కూడా టైప్ చేసేశా. కావాలంటే మనం లైవ్‌లో ఒపెనియన్స్ మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఒకసారి నాగ వంశీ గారితో ఓపెన్ కిడ్ని మీటింగ్ అయ్యింది. పోయి షార్ట్ ఫిల్మ్ తియ్యి ఫస్ట్.. ఇంగ్లీష్ బాగా వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పెట్టుకో ఇంక నీ పౌరుషం తీసి.. లైవ్‌లో కూర్చోవాలా? నీ ఓపెన్ కిడ్నీ తీసి.. ఆశకు హద్దు ఉండాలి అంటూ గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌ని యాడ్ చేశారు విశ్వక్ సేన్ తన ఇన్‌స్టా స్టోరిలో. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.





Advertisement

Next Story

Most Viewed