మైదా పిండి తింటే షుగర్ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

by Anjali |   ( Updated:2024-09-13 04:55:08.0  )
మైదా పిండి తింటే షుగర్ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: చూడానికి మైదా పిండి చాలా బాగుంటుంది. ముట్టుకుంటే స్మూత్‌గా, తినేటప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పిండితో తయారుచేసిన వంటకాలన్నీ చాలా స్పీడ్‌గా అయిపోతాయి. మిల్లులో బాగా పాలిష్ చేయబడిని గోధుమ పిండినే ఈ మైదా పిండి. యల్లో కలర్‌లో ఉండే గోధుమ పిండిని అజో డై కార్బొనమైడ్ , క్లోరిన్ వాయువు, బెంజైల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా మారుస్తారు.

మైదాపిండితో చేసిన వంటకాలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా న్యూడిల్స్, పిజ్జా, సమోసా, బ్రెడ్ వంటివి మైదా పిండితోనే ఎక్కువగా చేస్తుంటారు. కానీ చాలా మంది గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిదని, మైదా పిండి హెల్త్‌కు మంచిది కాదని చెబుతుంటారు. కాగా మైదా పిండి ఎక్కువగా తింటే హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్, ఊబకాయం వంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. మరీ మైదా పిండి తింటే మధుమేహం వస్తుందా? అని చాలా మందిలో తలెత్తిన ప్రశ్నకు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

మైదా పిండినీ క్రమంగా తీసుకున్నట్లైతే మాత్రం టైప్ 2 డయాబెటిస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మైదా పిండిలో ఎలాంటి పోషకాలు లేకపోయినా కూడా డయాబెటిస్‌ను ప్రేరేపించే సమ్మేళనమైన అలోక్సాన్‌లో సమృద్ధిగా ఉంటుందంటున్నారు. కాగా ఇది ఇన్సులిన్ స్పైక్‌లకు దారితీసే రక్తంలో చక్కెరను రిలీజ్ చేస్తుందట. కాగా డయాబెటిస్ పెషేంట్లు మైదా పిండి తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు దిశ బాధ్యత వహించదు. అనుమానాలు కనుక ఉంటే నిపుణులకు సంప్రదించండి.

Advertisement

Next Story

Most Viewed