- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే కచ్చితంగా పెటాకులే.. Venu Swamy సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ కపుల్స్ విడిపోతారని చెప్పి సంచలనం సృష్టించారు. అలాగే సమంత, నాగచైతన్య పెళ్లి సమయంలోనే వాళ్లు విడాకులు తీసుకుంటారని చెప్పి అందరికీ షాకిచ్చాడు. కానీ, వాళ్లు నిజంగానే విడాకులు తీసుకుని విడిపోవడంతో ఆయన చెప్పింది జరుగుతుందని అందరూ నమ్మడం మొదలు పెట్టారు.
తాజాగా, వేణు స్వామి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రకుల్ ఇటీవల బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ మరికొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వేణు స్వామి రకుల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇప్పటికే నేను ఆ హీరోయిన్ పెళ్లి జీవితం కలిసి రాదని చెప్పాను. అయినా ఆమె పెళ్లి చేసుకుంటే మాత్రం సమంత లాగే విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కెరీర్ కూడా డల్ అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు కొంత మంది వేణు స్వామి మాటలు నిజమవుతాయని అంటే మరికొంత మంది వాటిని కొట్టి పారేస్తున్నారు.
Also Read: ఆమె అంతే.. నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేసిన Vishal