ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే అతని ఆస్తులు ఎవరికి చెందుతాయంటే..?

by sudharani |
ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే అతని ఆస్తులు ఎవరికి చెందుతాయంటే..?
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘కల్కి, రాజాసాబ్, స్పిరిట్’ వంటి పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న డార్లింగ్.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ‘సలార్ 2’ కూడా చేయాల్సి ఉంది. ఇది ఇంకా పట్టాలెక్కనట్లు తెలుస్తుంది. అయితే.. ప్రజంట్ నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్న ప్రభాస్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో ఒకడిగా నిలిచాడు. ఎలా లేదు అన్నా.. ఒక్క సినిమాకు వచ్చి ప్రభాస్ పారితోషికం రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రభాస్‌కు ఆస్తుల విలువ కూడా ఎక్కువే. ఇతనకి ఖరీదైన ఫాంహౌస్‌లు, బంగ్లాలు, విదేశాల్లో ఇళ్లు, లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

కానీ, 44 సంవత్సరాలు వస్తున్న ప్రభాస్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. పెళ్లిపై ప్రస్తావన వచ్చిన ప్రతిసారి.. ఏదో రకంగా తప్పించుకుంటాడు మన రెబల్ స్టార్. ఒకవేల పెళ్లి చేసుకుని ఉంటే.. ప్రభాస్ ఆస్తులు వారి పిల్లలకు పంచుతాడు. కానీ ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. మరి మన డార్లింగ్ సంపదన ఎవరికి పెడతాడు అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి అభిప్రాయాల మేరకు.. డార్లింగ్‌కు సోదరుడు ప్రభోద్, సోదరి ప్రగతి ఉన్నారు. ఇక వీరితో పాటుగా.. పెదనాన్న కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డార్లింగ్ తర్వాత కూడా వివాహం చేసుకోకుండా అలాగే ఉంటే అతని ఆస్తులన్నీ వీరికే చెందుతాయంటున్నారు. మరి ప్రభాస్ ఇప్పటికైనా ఒక ఇంటివాడు అవుతాడా.? లేక ఎప్పటికి ఇలాగే ఉంటాడా అనేది మన రెబల్ స్టార్‌కే తెలియాలి.

Advertisement

Next Story

Most Viewed