నేరం రుజువైతే నయనతారకు ఐదేళ్ల జైలు శిక్ష!

by sudharani |   ( Updated:2022-10-12 11:53:31.0  )
నేరం రుజువైతే నయనతారకు ఐదేళ్ల జైలు శిక్ష!
X

దిశ, సినిమా : తమిళ సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్‌, స్టార్ హీరోయిన్ నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించి చిక్కుల్లో పడ్డారు. సరోగసీ విధానంలో వారు తల్లిదండ్రులైనట్లు తెలుస్తుండగా.. ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం నేరమని సుప్రీంకోర్టు 2019లో తీర్పును వెలువరించింది. అయితే ఇవేం పట్టించుకోని నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే నయన్, విఘ్నేష్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. అలా కాకుండా దత్తత చేసుకున్నామని చెప్పినా సమస్యలు తప్పవు. ఎందుకంటే పిల్లలను దత్తత తీసుకోవాలంటే లీగల్‌గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి చట్ట పరంగా అడాప్ట్ చేసుకుంటే పర్లేదు. లేదంటే చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే, ఇంత జరుగుతున్నా విఘ్నేష్ మాత్రం కూల్‌గా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇవి కూడా చదవండి :

బాధపడుతున్న అలియా ఫస్ట్ బాయ్‌ఫ్రెండ్.. ఆమెకిచ్చిన గిఫ్ట్ దొంగిలిస్తానంటూ..

Advertisement

Next Story