- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anupama లాంటి కూతురుంటే బాగుండేది : Allu Aravind

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ '18 పేజెస్'. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. ఈ నెల 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న మేకర్స్ తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇందులో భాగంగా అతను అనుపమ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ''ఈ మూవీ గురించి చాలా మాట్లాడాలని ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాట్లాడలేను. నేను తర్వాత మాట్లాడతాను. కానీ అనుపమ గురించి మాత్రం మాట్లాడకుండా ఉండలేక పోతున్నాను. నాకు కూతురు గనుక ఉంటే.. ఆమెలాగే ఉండాలనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి అనుపమ. నిజం చెప్పాలంటే అనుపమ సో.. ట్రాన్స్పరెంట్.. ఎందుకంటే.. తన మాట విధానం, తను ఉండే విధానంలో నటన ఉండదు. తనెలా ఉండాలనుకుంటుందో అది ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఇలాంటి వారు చాలా అరుదు. అందుకే నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం' అని పేర్కొన్నాడు.